
తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ గా రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి సోమవారం రోజు ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ యాదగిరి, మోపాల్ మండల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బున్నే రవి, అమ్రాబాద్ రవి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్వేష్ రెడ్డి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని వారు ఆకాంక్షించారు.