ఐఐటి పట్టా అందుకున్న జిల్లా విద్యార్థి

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్ టణానికి చెందిన శ్రీలేఖ విద్యార్థి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన పాట్నా ఐఐటి పదవ స్నాతకోత్సవంలో ఐఐటి పట్టా అందుకున్నారు. 2019 బ్యాచ్ కు చెందిన శ్రీలేఖ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటి పాట్నాలు కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసుకున్నారు. ఐఐటి పాట్నాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో జిల్లా నుండి సీటువసంపాదించిన ఏకైక విద్యార్థిగా మన్ననలు పొందారు. ఈ సందర్భంగా శ్రీలేఖ మాట్లాడుతూ ఐఐటి పాట్నాలో చదివి పట్టా పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భిక్కనూర్ పట్టణానికి కేంద్రానికి చెందిన శ్రీలేఖ పట్టా పొందడం పట్ల పట్టణ ప్రజలు విద్యార్థినిని, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.