కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం

District Task Force Committee meeting chaired by the Collector– బస్టాండ్‌ పరిధిలో ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి నిరాకరణ
– అక్రమ రవాణాను అరికట్టాలి
– సీజ్‌ చేసిన వాహనాలను వేలం వేయాలి : కలెక్టర్‌ కర్ణన్‌
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్‌
నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయములో సోమవారం జరిగిన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటి సమావేశము జిల్లా కలెక్టర్‌ అర్వి.కర్ణన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కమిటీ కి చైర్మన్‌ గా జిల్లా కలెక్టర్‌, కో- చైర్మన్‌ గా జిల్లా ఎస్‌.పి, కమిటీ సభ్యులుగా జిల్లా రవాణా అధికారి, టిఎస్‌ ఆర్టిసి రీజినల్‌ మేనేజర్‌, ఉన్నారు. ఈ సమావేశములో టిఎస్‌ఆర్టిసి, రీజినల్‌ మేనేజర్‌, నల్గొండ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్‌ అర్‌.వి.కర్ణన్‌ మాట్లాడుతూ పోలీసు, రవాణా శాఖ అధికారులు బస్టాండ్‌ పరిధిలో రెండు కిలోమీటర్ల వరకు ఏటువంటి ప్రైవేటు వాహనాలను నిలపకుండా చూడాలని, స్వంత వాహనములల్లో, ఎల్లో ప్లేట్‌ వాహనములలో అక్రమ రవాణాను అరికట్టాలని , కాంట్రాక్టు క్యారేజ్‌ వాహనాలను స్టేజి క్యారేజ్‌ గా నడపకుండ చూడాలని సూచించారు. అంతేకాకుండా ఆర్టిసి కి చేయుతనివ్వాలని పోలీస్‌ శాఖ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.ఈ అక్రమ రవాణా నకరేకల్‌ బస్టాండ్‌, కొండమల్లేపల్లి బస్టాండ్‌ (దేవరకొండ), మిర్యాలగూడ బస్టాండ్‌, నార్కెట్‌ పల్లి, నల్గొండ బస్టాండ్‌ ల నుండి అధికంగా జరుగుతున్నాయని ఆయా శాఖల అధికారులకు తెలిపారు. అంతే కాకుండా పైన తెలిపిన నాలుగు డిపో గ్యారేజ్‌ పరిధిలో సిజ్‌ చేయబడి ఉన్న 105 వాహనములకు వేలం వేయవలసిందిగా రవాణా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమములో టి ఎస్‌ ఆర్టిసి రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి, పోలీస్‌ శాఖా నుండి డిఎస్పి బి. సైదా, రవాణా శాఖ అధికారి సురేష్‌ రెడ్డి, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ లు ఎస్‌. మాధవి వి. శివశంకర్‌ నల్గొండ జిల్లా కు చెందిన వివిధ డిపోల మేనేజర్‌ లు పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలి
ప్రజావాణి లో ప్రజల నుండి అందిన అర్జీలు పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ అర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజావాణికి విచ్చేసిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి కష్ట పడి తమ సమస్య లపైన వినతులను ఇవ్వడాని కీ ప్రతీ వారం కలెక్టరెట్‌ కీ ప్రజలు వస్తుంటారని ఆయా ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించిపరిష్కారం చేయాలని అన్నారు.ఈ ప్రజావాణిలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.