నవతెలంగాణ – జక్రాన్ పల్లి
న్యూఢిల్లీలోమంగళవారం ఎం ఎస్ ఎంఈ శాఖ మంత్రి నారాయణ రాణితాటిని నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతి రెడ్డి కలిసి పసుపు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా పసుపు పంటకు కేంద్రం సహకరించి ఎగుమతులు, దిగుమతుల ద్వారా పసుపు పంటకు అధిక మద్దతు ధర వచ్చేటట్లు అదే విధంగ భవిష్యత్తులో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను అన్ని రకాల ఆదుకోవాలని కోరామన్నారు. అదే విధంగా జిల్లాలోని కమ్మర్ పల్లి, వేల్పూర్, ధర్పల్లి మండలాల్లో ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలల్లో సరైన వసతులు కల్పించి రైతులకు అందుబాటులోకి తేవాలని కొరమన్నారు.