జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి

Districts should do justice to all the teachers who have changed jobs– కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు  డిమాండ్‌ చేశారు. ఆదివారం 317 జివో 317 డిస్లోకేటేడ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ (డేటా) రాష్ట్ర నాయకులు పడకంటి-అజయ్ కుమార్, దత్తాద్రి, నిజామాబాద్ జిల్లా నాయకులు దినేష్, సురేష్, మారుతి, అనంతజీవి, ప్రవీణ్, వినాయక్, నర్సయ్య, శివ ప్రసాద్, రాజేష్, రమేష్, మహేశ్వరి  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పి అర్ టి యు అద్యక్షులు మోహన్ రెడ్డి, టి ఎస్ యు టి ఎఫ్ అద్యక్షులు సత్యనంద్, ఉపాధ్యాయ నాయకులు కృష్ణవేణి, శ్రీకాంత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనిగల్ల సురేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిజామాబాద్ లో 317 జివోలో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ న్యాయం కోసం ధర్మ పోరాటంలో దీక్షలో పాలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వారి జిల్లాలకు కేటాయించాలని అన్నారు. గత ప్రభుత్వం హయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల వల్లనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతి సాగుతుందని, ఉపాధ్యాయులు మాత్రం ఇతర జిల్లాలకు పంపడం వలన కుటుంబానికి దూరమై, చిన్న చిన్న పిల్లలను వదిలేసి ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్ర నాయకులు పడకంటి-అజయ్. కుమార్, నిజామాబాద్ జిల్లా నాయకులు దినేష్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులు భవిష్యత్తు బాగవుతుందని ఉపాధ్యాయులకు బాసటగా నిలవాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని గుర్తు చేశారు.ప్రధాన డిమాండ్లుగా 317 జివోపై ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లను బహిర్గతం చేయాలని అన్నారు.ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని, జిల్లాలు మారిన ఉపాధ్యాయులను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే 317 జివోను సవరించి భాధితులందరికీ సత్వర న్యాయం చేయాలన్నారు.317 జివో సమస్య గూర్చి, వాటి పరిష్కార మార్గాల గూర్చి ఉపాద్యాయ సంఘ నాయకులు చర్చ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు సురేష్, మారుతి, అనంతజీవి, ప్రవీణ్, వినాయక్, నర్సయ్య, శివ ప్రసాద్, రాజేష్, రమేష్, మహేశ్వరి మరియు వివిధ జిల్లాల నుంచి 317 జివో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.