నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణ సెంట్రల్ లైటింగ్ పనులకు రోజు రోజుకి ఆటంకాలు ఎదురు అవుతున్నాయి. ఒకటి పరిష్కారం అయితే మరొకటి తలెత్తడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రహదారి విస్తరణ లో రోడ్ సైడ్ చిరు వ్యాపారులు జీవన భృతి కోల్పోతున్న నేపధ్యం వారినుండి ఎదురైన అడ్డంకిని అదిగమించగానే నూతన పాత విద్యుత్ లైన్ తొలగింపు,నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దీంతో శుక్రవారం విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బి శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఎన్ని స్థంబాలు తొలగించాలి ఎక్కడెక్కడ డ్రైనేజీ అడ్డు పడే స్థంబాలు ఎన్ని ఉన్నాయనేది గుర్తిస్తున్నారు. నివేదిక పూర్తి అయిన వెంటనే ప్రతిపాదనలు పంపుతామని ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం,ఆర్ అండ్ బీ డీఈఈ శ్రీనివాస్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు శాఖల ఏఈఈ లు రవి,రామిశెట్టి శ్రీనివాస్,శెట్టిపల్లి కృష్ణార్జున రావు లు పాల్గొన్నారు.