”ఉపాధి కల్పనతో సహా సాంఘిక సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వెతకడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని కాదు” అంటూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఒక బహిరంగ వేదికపై అభిప్రాయపడ్డారు. విచిత్రమేమంటే భారతదేశ ఉపాధి కల్పనలపై రూపొందించిన రిపోర్టును విడుదల చేస్తూ ఈ అభిప్రాయాలని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఉపాధి కల్పన సాంఘిక సమస్యలకు పరిష్కారాన్ని ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కాకపోతే మరెవరు పరిష్కరించాలి?అధికారులే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే సిద్ధాంతాలు వల్లిస్తే ఇక ప్రభుత్వాల పరిస్థితేమిటి. ‘ప్రజల ఆర్థిక,సాంఘిక, సామాజిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాన్ని ఇవ్వడమే’ కదా ప్రభుత్వాల బాధ్యత. ఈ అంశాన్ని అత్యున్నత స్థాయి అధికారులే మరిచిపోతే ఎలా? ఉపాధి కల్పనంటే అపాయింట్మెంట్ లెటర్లను ప్రభుత్వాలు ఇవ్వమని కాదు. అంతేకాకుండా ఎక్కడో ఒకచోట కల్పించ బడిన ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లను మోడీ తామే ఇస్తున్నట్టు ప్రకటించు కోవడమూ కాదు.ఉపాధి కల్పన అంటే వివిధ రంగాలలో మెరుగైన అవకాశాలు ఏర్పడేలా విధివిధానాలు రూపొందించాలిగా. అది విద్యా విధానం నుండి మొదలుకొని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల అభివృద్ధి వరకు ప్రతి చోట ప్రభుత్వ ప్రమేయం ఉంటేనే అన్ని రకాల మానవ వనరులకి తగిన విధమైన అవకాశాలు దొరుకుతాయి. ఏయే ప్రాంతంలో ఏయే రకమైన మానవ వనరు ఉన్నది. దానిని ఎలా ఉపయోగించు కోవాలనే ధ్యాస నిరంతరం ఉండాల్సింది ప్రభుత్వానికేగా! అన్ని ప్రజలే కల్పించుకునేదే అయితే ఇక ప్రభుత్వాలు ఎందుకు? ఈ రకమైన ఆటవిక సమాధానాన్ని సూచించడానికి అనేకమంది ఊవ్విళ్ళూరు తారు. విపరీతమైన పరోక్షపన్నులు విధిస్తు ంటే, కార్పోరేట్లకు రాయితీలిస్తుంటే బాధ కలగదు గానీ సామాన్య ప్రజలకు విదిలిం చే పథకాలపై అక్కసు వెళ్లగక్కు తారు.
అధికారికంగా ఆర్థిక సలహాదారే విడుదల చేసిన భారత దేశ ఉపాధి కల్పన రిపోర్ట్ ప్రకారం దేశంలో ఉపాధి రహిత అభివృద్ధి చోటుచేసుకుంటున్నదని సదర్ రిపోర్టు ముక్తాయించింది. అంతేకాకుండా ఈ పదేండ్లలో వేత నాలు చాలా రంగాల్లో స్తంభించాయని, కొన్నిచోట్ల తిరోగమన వృద్ధి కనిపిస్తున్నదని కూడా వెలువడింది. ఇదే రిపోర్టు ప్రకారం దేశంలోని మొత్తం అన్‌స్కిల్డ్ వర్కర్లు పెరిగిపోతున్నారు. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం మందిలో 62శాతం అన్‌స్కిల్డ్ ఉంటే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మొత్తం వర్కర్లలో 70 శాతం మంది నైపుణ్యం లేని వాళ్లే ఉన్నారు. ఇలా నైపుణ్యం లేని వర్కర్ల వేతనాల్లో కనీస వేతనాలు ఎవరికి అందడం లేదని ఇదే రిపోర్టు సూచిస్తుంది. అకస్మాత్తుగా దినదినాభివృద్ధి చెందిన ఇండిస్టీ ‘గిగ్ వర్కర్ల’ (జొమాటో, స్విగ్గి, బ్లింకిట్ మొద..) ఇం డిస్టీలో పనిచేస్తున్న వారి పరిస్థితి డోలాయమానంగా ఉంది. అనగా చేస్తున్న ఉపాధికి పొందుతున్న వేతనాలకు ఏ రకమైనటువంటి నిర్దిష్టత లేదు. అంతేకాకుండా సాంఘిక భద్రత కూడా కల్పించబడటం లేదు.
అందరికీ ఉపాధి కల్పించలేని అనుభవం అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాల ముందున్నది. అందుకే దానికి పరిష్కారం మార్గం గానీ వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టాలని నాలుగు దశాబ్దాల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితి ఏమంటే దాదాపు వత్తి నైపుణ్య కోర్సులన్నీ కనుమరుగైపోయి కేవలం ఇంజనీర్లను ఉత్పత్తి చేయడంలో దేశం పరిగెడు తోంది. ఇలా ప్రొడ్యూస్ చేయబడిన ఇంజనీర్లలో అత్యంత తక్కువ శాతం మందికి మాత్రమే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నవి. పైన పేర్కొన్న నివేదిక ప్రకారం ఉపాధికై వేచి చూస్తున్న వారిలో 83శాతం యువత ఉన్నది. 2000 సంవత్సరంలో మొత్తం ఉపాధిదారులలో 35.2శాతం యువత ఉంటే 2022 నాటికి 65.7 శాతానికి పెరి గింది. ఒకవైపు నిరుద్యోగ యువత పెరుగుతుంటే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలలో పరిష్కరించవలసింది పోయి కేవలం రాజకీయంగా ఓట్లు సీట్లకే ప్రయత్నిస్తుంటే కనీసం ఆర్థిక సలహాదారులు కూడా సరైన సూచనలు చేయకుండా ప్రభుత్వాలకు వంత పాడితే జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. కలవరపెట్టే మరో అంశమేమిటంటే ప్రభుత్వమూ కొందరు న్యాయవాదులను ఎగదోసింది. న్యాయ మూర్తులను ఎవరో ప్రభావితం చేస్తున్నారంటూ ఎన్నికలబాండ్లను బహిరంగ పరచకూడదని సుప్రీం లో పిటిషన్ వేసిన ‘ఒక న్యాయకోవిదుడి’తో సహా 600మంది న్యాయవాదులు సిజెఐకి లేఖ రాశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఎలక్టోరల్ బాండ్ల వివరాలనివ్వడానికి కోరినప్పుడు ఆ బాండ్ల వివరా లను ఇవ్వడానికి సమయం సరిపోదు అన్న ఎస్‌బిఐ సుప్రీంకోర్టు మొట్టికాయలతో వారం రోజుల్లోనే కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఇచ్చింది. ఇక్కడ ఎవరు ఎవరిని ప్రభావితం చేశారు? ఎస్‌బిఐకి వకాల్త పుచ్చుకున్నది హరి సాల్వే గారే! ఇందులో సూటిగా ప్రశ్నించిన సుప్రిం కోర్టుది తప్పా? దాత వివ రాలను బహిర్గతపరిస్తే ఆదిష్ అగర్వాలకు వచ్చిన ఇబ్బందేమిటి?. ఎలక్టోరల్ బాండ్ల బాగోతం బయట పడ్డప్పటి నుంచీ ఇట్లాంటి వారంతా తెగ బాధపడిపో తున్నారేంటో? నిజానికి భారతదేశంలో న్యాయ వ్యవస్థలే కాదు అనేక దర్యాప్తు సంస్థలు ప్రభావితానికి గురవుతున్నాయి. ఈ న్యాయ వాదులు నిజంగా కోరుకుంటే ఒక టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామికి బెయిల్ ఇవ్వడానికి హాలిడే రోజు కూడా సుప్రీంకోర్టు పనిచేయడంపై ఉన్న ప్రభావి తాన్ని ప్రశ్నించాలి? అక్రమ కేసును బనాయించి పదేండ్లు జైల్లో పడేసి జీవితాన్ని నాశనం చేస్తుంటే ఇలాంటి విజ్ఞులు ఏమైనట్లు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కాకుండా కింది స్థాయి న్యాయస్థానాలు పరిశీలిస్తున్నందుకు దానిపై ఉన్న ప్రభావితాన్ని ప్రశ్నించాలి. ఒక రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నఫలంగా రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీలో చేరి పార్లమెంటు స్థానానికి పోటీకి దిగుతున్నారంటే, ఒక తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ను తన విధులు నిర్వర్తించమని సుప్రీంకోర్టు కోరాల్చి వస్తుందంటే వారు ఎవరి ప్రభావానికి గురవుతున్నట్లు? గతంలో మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పిడుల్లో అర్దరాత్రి పూట నిద్రలేచి మరీ సుప్రీం కోర్టు విధులను నిర్వర్తించింది. ఎవరి ప్రభావంతో అలా చేయాల్సి వచ్చిందో ప్రశ్నించట్లేదు! ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర రాజకీయ పార్టీలను దశాబ్దాల క్రిందటి ఇన్‌కంటాక్స్ కేసులను తవ్వి తీసి వారి అకౌంట్లను సీజ్ చేయడం, వేల కోట్ల రూపాయలు ఇన్‌కంటాక్స్ పెనాల్టీలు వేయడం వంటివన్నీ ఆ డిపార్ట్మెంట్ చేస్తుంటే అది ఎవరి ప్రభావం చేత జరుగుతున్నట్లు!
ఈ న్యాయవాదుల సమూహం నిజంగా స్పందించాలనుకుంటే నిర్మలా సీతారామన్ తన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఎన్నికలలో పోటీ చేయలేదు అని చెప్పిన మాటని సుమోటోగా స్వీకరించి డబ్బుకు ఎన్నికలలో పోటీకి సంబంధం ఏముందో వెలికి తీయమని అభ్యర్థించాలి. అలా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నిర్ణయాలను తప్పుబడితే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ప్రతీ పౌరుడూ, ప్రతీ వ్యవస్థా ప్రభుత్వాన్ని నిశితంగా గమనించాలి, దాని ప్రతి అడుగునూ విమర్శనాత్మకంగా చూడకపోతే అధికార మత్తులో ఆశ్రిత పక్షపాతానికి తెర లేస్తూనే వుంటుంది. దానికి మంచి ఉదాహరణనే ఎలక్టోరల్ బాండ్ల బాగోతం.
రూ.ఐదు లక్షల మూలధనమున్న సంస్థ యాబై కోట్లు విరాళమిస్తున్నది, దేశంలోని ఫార్మాసూటికల్ కంపెనీలన్నీ కోట్ల రూపాయల్ని విరాళాలుగా ఇస్తున్నాయి! కానీ సమాజంలో నెలకొంటున్న కొత్త పోకడేమంటే విమర్శనాత్మకంగా కాకుండా ప్రభుత్వాన్ని పొగుడుతూ, సమస్యలకు తమను తామే నిందించుకునే ధోరణి పెరుగుతోంది! నిరంతరం ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రజల పక్షాన, ముఖ్యంగా కార్మికుల పక్షాన నిలబడే కమ్యూనిస్టులకు ఆదరణ అందుకే తగ్గుతుందేమో!
జి.తిరుపతయ్య
9951300016