ఆద్యంతం వైవిధ్యభరితం

‘నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, మన్మధుడు’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన డైరెక్టర్‌ కె. విజయభాస్కర్‌ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్‌ఫుల్‌ ఫన్‌ అండ్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకష్ణ ఎస్‌ఆర్కే ఆర్ట్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్‌ కథానాయికగా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలకుకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫన్‌ అండ్‌ థ్రిల్‌ రైడ్‌ని అందించింది.
దర్శకుడు విజరు భాస్కర్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఫన్‌ ఫుల్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌ అందించబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో శ్రీకమల్‌, శివాని రాజశేఖర్‌ పాత్రలు వినోదాత్మకంగా ఉన్నాయి. చివర్లో హర్రర్‌ ఎలిమెంట్స్‌ చాలా క్యూరియాసిటీ పెంచాయి. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఫన్‌, థ్రిల్‌ను మరింత ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈనెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ శర్మ, గెటప్‌ శ్రీను, గుండు సుదర్శన్‌, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సతీష్‌ ముత్యాల, ఎడిటర్‌ : ఎం.ఆర్‌ వర్మ.