జీలో రూ.2 వేల కోట్ల నిధుల మళ్లింపు..!

జీలో రూ.2 వేల కోట్ల నిధుల మళ్లింపు..!– సెబీ దర్యాప్తు
–  14 శాతం పడిపోయిన షేర్‌ ధర
ముంబయి: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లో రూ.2,000 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని రిపోర్టులు వస్తోన్నాయి. ఆ సంస్థ ఆర్థిక అవకతవకలను సెక్యూరి టీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఇటీవల గుర్తించి విచారణ ప్రారంభించిందని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్టులో పేర్కొంది. ఓ కేసులో భాగంగా జీ వ్యవస్థాపకులపై విచారణ జరుపుతున్న క్రమంలో కంపెనీ నుంచి రూ.2,000 కోట్లు (241 మిలియన్‌ డాలర్లు) అక్రమంగా తరలించినట్లు వెల్లడయ్యిందని సమాచారం. ఇది సెబీ తొలుత అంచనా వేసిన దాని కంటే 10 రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ఈ అంశమై జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన కుమారుడు పునీత్‌ గోయెంకా, బోర్డు సభ్యులను సెబీ వివరణ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై జీ, సెబీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. సుభాష్‌ చంద్ర, గోయెంకా తమ సొంత ప్రయోజనాల కోసం కంపెనీ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సెబీ గతకొంతకాలంగా దర్యాప్తు జరుపుతోంది.
తాజాగా మరింత సమాచారం బయటికి రావడంతో బుధవారం బిఎస్‌ఇలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఏకంగా 14.77 శాతం పతనమై రూ.28.50కు పడిపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుదిరిన విలీన ఒప్పందాన్ని కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (సోనీ ఫిక్చర్స్‌ నెట్‌వర్క్‌) రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పంద విలువ రూ.83వేల కోట్లుగా ప్రకటించాయి. 2021 డిసెంబర్‌ 22న ఈ ఒప్పందం కోసం సంతకాలు చేసు కోగా.. ఇటీవల సోనీ పిక్సర్స్‌ ఈ డీల్‌ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిం చింది. కాగా.. దీన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతు న్నాయని వస్తోన్న వార్తలను తాజాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఖండించింది.