
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా దినేష్ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గo జక్రం పల్లి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా దివెష్ ముదిరాజ్ (కేశపల్లి ),వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ ముదిరాజ్ (పుష్పాలపల్లి), గౌరవాధ్యక్షులుగా సదానంద ముదిరాజ్ ( కొలిపక్), ప్రధానకార్యదర్శి గా అరుణ్ కుమార్ ముదిరాజ్ ( పడకల్), కోశాధికారిగా సంతోష్ ( సికింద్రా పూర్) ఈ ఎన్నికలు జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు బాల నరసయ్య ముదిరాజ్, కాసాని యువత అధ్యక్షులు కిరణ్ కుమార్ ముదిరాజ్, జిల్లా జాయింట్ సెక్రెటరీ యాటకర్ల గణేష్ ముదిరాజ్, కొప్పు సుదర్శన్ ముదిరాజ్, సలహాదారు భూమయ్య ముదిరాజ్ మండల ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు.