దివీస్ సహకారం ఎంతో అభినందనీయం.

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో జిల్లా మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులకు దివిస్ యజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ చేతుల మీదుగా బ్యాగులు పాదరక్షలు అందజేశారు. అనంతరం స్కూల్ పిల్లలకు డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.పిల్లలకు మందులు,న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత మాట్లాడుతూ దివీస్ లేబరేటరీస్ యజమాన్యం చేస్తున్న అభివృద్ధి పనులు ఉపయోగపడుతున్నాయని అన్నారు. పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తున్నా రని చెప్పారు. గ్రామంలో నిర్మించిన గ్రంథాలయం భవనం త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని అన్నారు.ఈ కార్యక్ర మంలో దివీస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు,సాయికృష్ణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు