శంకుస్థాపనకు కొబ్బరికాయ కొడుతున్న దివిస్ డిజిఎం సుధాకర్ రావు 

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దివిస్ కంపెనీ నుండి అంకిరెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు దాదాపు 2.50 కిలోమీటర్ల వరకు దివిస్ సిఎస్ఆర్ నిధుల నుండి 1 కోటి 26 లక్షల 8 వేల 16 రూపాయలు డాంబర్ రోడ్డు నిర్మాణానికి డీజీఎం పెండ్యాల సుధాకర్ రావు బుధవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు.గతంలో దివిస్ కంపెనీ ప్రారంభం నుంచి చౌటుప్పల్ మండలం మరియు ఇతర ప్రాంతాలకు ఇప్పటివరకు ఎన్నో వందలకోట్ల నిధులను సిఎస్ఆర్ ఫండ్ కింద అభివృద్ధి చేశామని డిజిఎం సుధాకర్ రావు అన్నారు. అంకిరెడ్డిగూడెం గ్రామ అభివృద్ధి కొరకు ఎంతవరకైనా ఖర్చు చేయడానికి సుధాకర్ రావు చెప్పారు. అంకిరెడ్డిగూడెం గ్రామ అఖిలపక్షం కమిటీ తీర్మానం మేరకు నడుచుకుంటామని సుధాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిగూడెం మాజీ సర్పంచులు ముద్ధం సుమిత్రసత్తయ్య గౌడ్ సుర్వి మల్లేష్ గౌడ్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉప్పు భద్రయ్య అంకిరెడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శి జి.పాండు ఎజిఎం ప్రకాష్ మేనేజర్ ఆర్.నరసయ్య లైజన్ ఆఫీసర్ బి. కే.కుమార్ సీనియర్ ఆఫీసర్ కె.శివప్రసాద్ అఖిలపక్ష నాయకులు గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు