ఆరెగూడెం గ్రామానికి దివీస్ ఎంతో అభివృద్ధి చేసింది..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ అభివృద్ధికి దివీస్ ఎంతగానో కృషి చేసిందని సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం అన్నారు.దివీస్ ఆధ్వర్యంలో గ్రామంలో జిల్లా మండల పరిషత్ పాఠశాలల బాలబాలికలకు ఉచిత వైద్య శిబిరం డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం దివీస్ బ్యాగులు పాదరక్షలు మునగాల ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి దివీస్ యాజమాన్యం ఎంతో గాను కృషి చేసిందని కొనియాడారు.మా గ్రామం పై మరింత దివీస్ యజమాన్యం అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు M.వెంకటేశం,పి.శేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి కో ఆప్షన్ మెంబర్ మన్నె ప్రతాప్ రెడ్డి గ్రామ పెద్దలు మన్నె రవీందర్ రెడ్డి,M. అనిల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, బి.దశరథ దివీస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.