
చౌటుప్పల్ మండలం అల్లాపురం కైతాపురం గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల బాల బాలికలకు దివీస్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జయంత్ కుమార్ బాల బాలికలకు పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ కిట్లు, మందులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేత దివీస్ సమకూర్చిన బ్యాగులు,పాదరక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.మాధవి,ఎస్.పురుషోత్తం రెడ్డి ఉపాధ్యాయులు పి.జంగాచారి దివీస్ సిఎస్ ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు,ఎస్.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.