హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో డివిజనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మడప రాంరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు మడప జైపాల్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. కేపీఎల్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ప్రారంభించారు. గత 3 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తూ యువతలో క్రీడ స్ఫూర్తి ని ప్రోత్సహిస్తున్న మడప రాంరెడ్డి ట్రస్ట్ ను మరియు కూచనపల్లి క్రికెట్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేడం లింగమూర్తి, కూచనపల్లి సర్పంచ్ కేసిరెడ్డి రామచంద్ర రెడ్డి, పందిళ్ళ సర్పంచ్ తోడేటి రమేష్, అకన్నపేట్ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, పందిళ్ళ ఎంపీటీసీ బాణాల జయలక్మి తదితరులు పాల్గొన్నారు.