– ఏపీకి 11 ఎకరాలు
– తెలంగాణకి 8 ఎకరాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ భవన్ విభజన ఎట్టకేలకు వీడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవన్ ఆస్తులను విభజిస్తూ కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీికి 11.536 ఎకరాలు కేటాయించగా, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఏపీకి కేటాయించిన 11.536 ఎకరాల్లో 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, అలాగే నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిం చారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల్లో శబరి బ్లాక్ లో 3 ఎకరాలు, పటౌడి హౌస్ లో 5.245 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.