డివిజన్ విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

Division Retired Employees Working Committee Meetingనవతెలంగాణ –  ఆర్మూర్ 
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం 5 వ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు రవీంధర్, ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్, ఉపాధ్యక్షులు పండరి, అధ్యక్షులు రాంరెడ్డి,విశ్రాంత  ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి గంగారాం పాల్గొని, ఇటీవల అకాల మరణం పొందిన ఉద్యోగుల ఆత్మశాంతికై  రెండు నిమిషాలు మౌనం పాటించి, యూనిట్ కార్యదర్శి నివేదిక,ఆర్థిక నివేదికలను సభ్యుల ముందు చదివి వినిపించారు. అందులోని అంశాలను  కార్యవర్గ సభ్యులందరూ  చెప్పట ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ  సందర్భంగా  రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంధర్, కార్యదర్శి భోజాగౌడ్ ఉపాధ్యక్షులు పండరి  మాట్లాడుతూ.. పట్టణంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఎంతో సంతోషాన్ని కలిగించిందని, నిజామాబాద్ జిల్లాలో  డివిజన్ కు ప్రత్యేక భవనం ఉండడం ఐక్యతతో కూడిన కార్యవర్గం అన్ని సంఘాలకు ఆదర్శనీయమన్నారు.నూతన ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా ఇంతవరకు ఉద్యోగులకు రావాల్సిన డిఏలు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. అలాగే పిఆర్సీ, అయ్యార్లపై ప్రకటన చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్స్ కు ఈ హెచ్ ఎస్ పూర్తిస్థాయిలో వర్తింపజేయకపోవడం నిరాశ జనకమన్నారు. ప్రభుత్వం సమస్య సాధనకై నిరసన తెలిపే వరకు సమస్యలను సాగదీస్తోందని రానున్న కాలంలో ఎప్పుడు ఏ నిరసనలు తెలుపవలసి వచ్చినా విశ్రాంత ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు హరి నారాయణ, సుధాకర్,ముత్తన్న, సుదర్శన్, రవీంద్ర మోహన్,గంగారెడ్డి, ఓబన్న,బ్రహ్మయ్య,జింధం నరహరి,పుష్పాకర్ రావు  తదితరులు పాల్గొన్నారు.