దివ్యాంగులు సవ్యాంగులతో సమానంగా రాణించాలి

Divyangs should excel at par with the able bodiedనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
దివ్యాంగులకు ప్రోత్సహం అందిస్తే వారు కూడా సవ్యాంగులతో సమానంగా రాణించగలరని ఎంపీ గోడం నగేష్ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వికలాంగుల క్రీడోత్సవాలను  నిర్వహించారు. శనివారం ఇందిరా ప్రియదర్శినిలో నిర్వహించిన ఈ పోటీలకు ఎంపీ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హ్యాండిక్యాప్ వెల్ఫర్ సొసైటి అధ్యక్షుడు ఇమ్రాన్ ఎంపీకి పలు సమస్యలను విన్నవించారు. రాయితీ రైలుపాస్ కోసం స్థానిక రైల్వే స్టేషన్లో ఓ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకోని దివ్యాంగుల కోసం క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. దివ్యాంగులకు కొంచం ప్రోత్సహం అందిస్తే వారు కూడా సవ్యాంగులతో సమానంగా రాణిస్తారన్నారు. దివ్యాంగులు గతంలో 3 శాతంగా ఉండేవారని ప్రస్తుతం 5 శాతం ఉన్నారన్నారు. అలాంటి వారి కోసం క్రీడ పోటీలు శారీరక ధృఢత్వం కోసం ఉపయోగపడుతాయన్నారు. అదే విధంగా దివ్యాంగుల సంఘం నాయకుల విన్నపం మేరకు త్వరలో రైల్వేపాస్ కోసం కౌంటర్ ను ఏర్పాటు చేసేల కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సబిత, ఏసీడీపీఓ మిల్క, రైల్వే నాందేడ్ సలహ మండలి సభ్యులు రఘుపతి, కబడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.