
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. దివ్యాంగుల పింఛన్ 3వేల నుండి 4 వేలకు పెంచడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాలు గృహనిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుడు డాకా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…. గతంలో ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల దృష్టి సారించి సమస్యలు పరిష్కరించలేదన్నారు. దివ్యాంగులకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పెంచిన రూ.4 వేల పింఛను అందించడం సంతోషంగా ఉందన్నారు.రూ.4వేల పింఛను అందించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించే భరోసాను కల్పించారన్నారు. రాష్ట్రంలోని దివ్యాంగులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన రూ.4వేల పింఛన్ డబ్బులు చూపిస్తూ దివ్యాంగులు సంబరపడ్డారు. పింఛన్లు పెంచి ఆర్థికంగా బలోపేతం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.