నవతెలంగాణ-శేరిలింగంపల్లి
భారతదేశంలో అతిపెద్ద రీజనల్ ఈవెంట్ అసో సియేషన్ తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అలంకృత రిసార్ట్‌లో కలశఫైన్ జ్యువెల్స్ సహకారంతో ‘దీపావళి మిలన్’ నిర్వహించారు. ఈవెంట్‌కు అలంకృత రిసార్ట్‌తో అసో సియేట్ స్పాన్సర్‌లుగా సెలెబ్రానో ఈవెంట్స్, ది హామ్లె ట్ లగ్జరీ రిసార్ట్ వ్యవహరించాయి. అసోసియేషన్ నుంచి అనేక ఫ్యామిలీలు ఈ ఈవెంట్‌కు విచ్చేశాయి. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ అధ్యక్షు డు ఆళ్ల బలరాం బాబు మాట్లాడుతూ స్నేహం, బం ధుత్వం, వ్యాపార సంబంధాలను పెంపొందించడా నికి వార్షిక దీపావళి మిలన్ వేడుకలను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వి నోద కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ దీపావళి మిలాన్లో భాగంగా అనేక బహుమతులను సభ్యులకు అందజేశారు. అర కేజీ వెండి వెడ్డింగ్ ప్లా నింగ్ కంపెనీ పింక్ పగ్డి స్పాన్సర్ చేసింది. ఈ వెం డిని పవన్ గెలుచుకున్నారు. ప్రీమియం వెడ్డింగ్ డిజైన్ కంపెనీ రాజాస్పాన్సర్ చేసిన ఓవెన్‌లు, మిక్సర్ గ్రైండర్లు, కాఫీ మేకర్‌లు, రైస్ కుక్కర్లు సభ్యులు గెలు చుకున్నారు. హాలీడేజెడ్.కామ్ ఉచిత విమాన టిక్కెట్ల ను స్పాన్సర్ చేసింది. వీటిని బంపర్ తంబోలా విజేత లకు గోవాలో బస ఏర్పాటు చేయనుంది. పట్టణం లో ని ప్రముఖ క్యాటరింగ్ కంపెనీలలో ఒకటైన వీ క్యాట రింగ్ బఫేను ఏర్పాటు చేసింది. ఇక్కడ వివిధ రైడ్‌లు, గేమ్‌లతో కూడిన ప్రత్యేక పిల్లల జోన్ కూడా ఏర్పాటు చేశారు. టీసీఈఐ సభ్యులు స్పాన్సర్ చేసిన రిటర్న్ గిఫ్ట్‌లు అతిథులకు అందజేశారు. టీఈఎఫ్‌ఏ జా యింట్ సెక్రటరీ కన్వీనర్ అజ్మత్ అలీ, టీసీఈఐ జన రల్ సెక్రటరీ రవి బురా, టీఈఎఫ్‌ఏ అధ్యక్షుడు మనో జ్ ఇనాని, కార్యదర్శి సందీప్ జైన్ తదితరులు పాల్గొన్నారు.