
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని, దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులతో నిండాలని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. తెలంగాణలోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి, బంగారు తెలంగాణ సాధనలో నూతనోత్తేజంతో ముందడుగు వేయాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.