దీపావళికి రిలీజ్‌

Diwali releaseహీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’. ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ ఈ సినిమాను రూపొంది స్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన వేఫరర్‌ ఫిలింస్‌ పై రిలీజ్‌ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో సోమవారం మీడియాతో హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘దీపావళి పండుగ సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. థియేటర్స్‌ దగ్గర పోటీ ఉంది. మేము ఈ నెల 31న రిలీజ్‌ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. అలాగే మా అందరికీ ఈ సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఏదో కొత్త కంటెంట్‌ మూవీలో ఉండబోతోంది అనే వైబ్‌ క్రియేట్‌ అయ్యింది’ అని తెలిపారు. ‘యూనిక్‌ పాయింట్‌తో కథ చేశాం. అలాగే కథను సరికొత్త స్క్రీన్‌ ప్లేతో ప్రెజెంట్‌ చేశాం’ అని దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘మూవీ కంటెంట్‌ మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది’ అని తెలిపారు.