దీపావళి సర్‌ప్రైజ్‌లు

దీపావళి సర్‌ప్రైజ్‌లుదీపావళి గిఫ్ట్‌గా తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి సరికొత్త అనౌన్స్‌మెంట్లు ఇచ్చి ఫ్యాన్స్‌ అందరినీ మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేశారు.
సలార్‌
ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతున్న యాక్షన్‌ ్‌ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. దీపావళి గిఫ్ట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్‌1న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
సైంధవ్‌
వెంకటేష్‌ నటిస్తున్న తన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. దీపావళి పర్వదినం నేపథ్యంలో మేకర్స్‌ ఈనెల 21న సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌-‘రాంగ్‌ యూసేజ్‌’ని లాంచ్‌ చేసి మ్యూజికల్‌ జర్నీని స్టార్ట్‌ చేయబోతున్న్టట్లు అనౌన్స్‌ చేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.
ఈగల్‌
రవితేజ, కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ”ఈగల్‌’. దీపావళి పండగ కానుకగా చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఈగల్‌’ టైటిల్‌ని పోస్టర్‌ కాన్సెప్ట్‌ జస్టిఫికేట్‌ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్‌.
భీమా
గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పై కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్‌ సరసన ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తు న్నారు. దీపావళి పండుగ సందర్భంగా గోపీచంద్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ అవతార్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
ఫ్యామిలీ స్టార్‌
విజరు దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. పరశురామ్‌ పెట్ల దర్శకుడు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి దీపావళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది.