నూతనంగా వచ్చిన జిల్లా జడ్జిగా జయరాజు గారికి ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా కమిటీఆధ్వర్యంలోసన్మానం చేశారు. అనంతరం రాజ్యాంగం ప్రజలు అనే అంశం మీద నిర్వహించిన జాతీయ సెమినార్ సావనీర్ ను అందజేశారు. జిల్లా లో ఉన్న సమస్యలను జిల్లా జడ్జి జయరాజ్కి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగారం అంజయ్య, చింతల రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తడక మోహన్, భువనగిరి బారసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోదావెంకటేశ్వర్లు, బర్ల డేవిడ్, జెల్లా రమేష్, స్వాతి, బాలగోని రాజశేఖర్, స్వామి శ్రీశైలం సత్తయ్య, జంగయ్య, కిరణ్ ,చింతల రాజు, పాల్గొన్నారు.