డిజెఎఫ్ (డిజిటల్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – హైదరాబాద్:నవతెలంగాణ – హైదరాబాద్:డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా టి10 సుందర్, కార్యదర్శిగా ఈ69 భాను ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఉపాధ్యక్షులుగా మహువా మీడియా వనజ, జనంటీవీ శంకర్, సహాయ కార్యదర్శులుగా ఎన్ 9మీడియా రాకేష్, ఇజం టీవీ నరేందర్, కోశాధికారిగా మాస్ వాయిస్ శంకర్  ఎన్నుకున్నారు. డిజిటల్ జర్నలిస్టుల హక్కుల కోసం డిజెఎఫ్ పనిచేస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అద్యక్ష, కార్యదర్శులు సుందర్, భాను ప్రసాద్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనవరి మొదటివారంలో రాష్ట్ర ఆఫీసు కేంద్రం  ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెండోవారంలో రాష్ట్ర వర్క్ షాప్ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. ఆ వెంటనే జిల్లా కమిటీలు వేయనున్నారు. యాదాద్రి భువనగిరి నుండి జిల్లా కమిటీల పని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు