– మూడో రౌండ్‌కు సెర్బియా స్టార్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2024
లండన్: కెరీర్ 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జొకో 6-3, 6-4, 5-7, 7-5తో జేకబ్ ఫియర్న్లీ (బ్రిటన్)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో గతేడాది ఈ టోర్నీ రన్నరప్ ఒన్స్ జబెర్ 6-1, 7-5తో రాబిన్ మోంట్‌గొమెరి (అమెరికా)ను చిత్తుచేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, ఫ్రెంచ్ సహచరుడు అల్బనొ ఒలివెట్టి ద్వయం 6-4, 6-4తో కజకిస్థాన్ ద్వయం అలగ్జాండర్ బబ్లిక్-షెవ్‌చెంకొను చిత్తు చేసింది.