జకోవిచ్‌ స్లామ్‌ నం.23

రికార్డు గ్రాండ్‌స్లామ్‌ సాధించిన నొవాక్‌
పారిస్‌ : టెన్నిస్‌ చరిత్రలో నొవాక్‌ జకోవిచ్‌ సరికొత్త రికార్డు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై 7-6(7-1), 6-3, 7-5తో వరుస గేముల్లో గెలుపొందిన జకోవిచ్‌ కెరీర్‌ 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో టైటిల్‌ సాధించి.. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం మూడేసి సార్లు ముద్దాడిన ఏకైక క్రీడాకారుడిగా నిలిచాడు.
టైటిల్‌ పోరులో జకోవిచ్‌ 11 ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో విరుచుకుపడ్డాడు. పాయింట్ల పరంగా 118-89తో రూడ్‌పై ఆధిపత్యం చెలాయించిన జకోవిచ్‌.. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకుని చారిత్రక విజయం సాధించాడు.