లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రీజియన్ ఛైర్మన్ గా డీకే రాజేష్

నవతెలంగాణ – ఆర్మూర్ 

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్  గ్రీన్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డి రీజియన్ ఛైర్మన్ డీకే రాజేష్  ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సోమవారం ఘనంగా సన్మానించడం జరిగింది. జోన్ చైర్మన్ గా నియమింపబడిన చేపూర్ గణేష్ సన్మానించడం జరిగింది.  ఈ సందర్భంగా రీజియన్ చైర్మన్ మాట్లాడుతూ.. ఎలెక్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (2024-2025) పాంపట్టి నాగేష్ తన పై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను రీజియన్ నందు గల జోన్ చైర్మన్ ల రీజియన్ నందు గల క్లబ్ ల సహాయంతో డిస్ట్రిక్ట్ నందు ఉత్తమ రీజియన్ గా ఉండే విధంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు.  ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్  ఆఫ్  గ్రీన్ అధ్యక్షులు గుజరాతీ గంగాప్రకాష్, కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, సభ్యులు గుజరాతీ నివేదన్, ఆకుల రాజు, పోల్కం వేణు, దాచేపల్లి సంతోష్, దొండి సాయి కృష్ణ, నసీరుద్దీన్, పాంపట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.