గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన డీఎల్పివో..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామపంచాయతీ రికార్డులను మంగళవారం రోజు ఎల్లారెడ్డి డి ఎల్ పి వో సురేందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా త్రాగునీటి సమస్య ఇంటి పన్నుల వాసులపై పలు వివరాలను సంబంధిత అధికారులకు అడిగి తెలుసుకున్నారు .అదేవిధంగా విశ్వకర్మ దరఖాస్తులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీ వో శ్రీనివాస్ ఉన్నారు.