రెంజల్ మండలం పేపర్ మిల్లు గ్రామపంచాయతీ రికార్డులను డిఎల్పిఓ మధుకర్ బుధవారం పరిశీలించారు. పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఏ ప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని గ్రామ కార్యదర్శి జక్కు భాస్కర్ కు సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ త్వరలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. డాటా ఎంట్రీ లో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన అన్నారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి భాస్కర్ తదితరులు ఉన్నారు.