ఈ నెల 14 లోపు ఆన్ లైన్ పూర్తి చేయాలి: డిఎల్పీఓ రాజీవ్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు హామీల పథకాల్లో భాగంగా ఇటీవల అయిదు హామీల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఈ నెల 14 లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు డిఎల్పీఓ రాజీవ్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక తాహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల్లో జరుగుతున్న దరఖాస్తుల ఆన్లైన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన మేరకు డేటా ఆపరేటర్ లను నియమించుకుని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. 19913 దరఖాస్తులకు గానూ ఇప్పటివరకు 9306 దరఖాస్తులు ఆన్ లైన్ చేసినట్లు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు.  అనంతరం మేజర్ పంచాయితీ అశ్వారావుపేట తో పాటు అచ్యుతాపురం,నందిపాడు పంచాయతీలలో పారిశుధ్యం పనులు పరిశీలించారు. వీరి వెంట ఎంపిడిఓ జి.శ్రీనివాసరావు,ఎం పీ ఈ ఓ సీతారామరాజు,ఈఓ గజవెల్లి హరికృష్ణ తదితరులు ఉన్నారు.
మండలం              దరఖాస్తులు             ఆన్లైన్ అయినవి        
అశ్వారావుపేట         19913                      9306
దమ్మపేట                19351                  12072
ములకలపల్లి             12867                    7305
అన్నపురెడ్డి పల్లి         7102                        5386
చండ్రుగొండ            10189                      6394
మొత్తం                  69422                  40463