ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూసుకోవాలి: డిఎల్పిఓ శ్రీనివాస్

నవతెలంగాణ – భిక్కనూర్/ రాజంపేట్
మండలంలోని ప్రజలకు నీటి కష్టాలు లేకుండా రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని డిఎల్పిఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించాలని, గత వేసవికాలంలో నీటి సమస్యతో బాధపడుతున్న కాలనీలలో ముందుగానే నీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రజిత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, ఏపీవో రాధిక, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి- ఎంపీడీవో రఘురాం రాజంపేట మండలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో రఘురాం పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అపర్ణ, ఏంట్రా ఏఈ రజిత, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.