
కోఠి ప్రభుత్వ ఈ ఎన్ టి (చెవి, ముక్కు, గొంతు) ఆసుపత్రి ని సోమవారం డి ఎం ఈ డాక్టర్ వాణి అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలియతిరిగారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పలు సూచనలు చేశారు.ఆసుపత్రికి అవసరమయ్యే అన్ని వసతులు సమకూర్చేందుకు తానను సంప్రదించవచ్చునని చెప్పారు.ఆసుపత్రిలో రోగులకుఅందుతున్న వైద్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ ఎం ఓ డాక్టర్ జయ మనోహరి తదితరులు పాల్గొన్నారు.