భువనగిరి మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. బొల్లెపల్లి వైద్య సేవలపై ఆరా తీశారు. తదనంతరము ఆశాడే సందర్భంగా మాట్లాడుతూ ఆశలందరూ ఫీవర్ సర్వేలో పాల్గొనాలని డోర్ టు డోర్ సర్వే చేసి స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనాలని దిశ నిర్దేశం చేశారు. తదుపరి జిల్లా టీకాల అధికారి డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడిని కి వాక్సినేషన్ అందించాలని, ప్రతి పిల్లవాడు తల్లిపాలు తీసుకునేలా ఆరోగ్య విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి మధుసూదన్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యనారాయణ, సత్యవతి, ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొండా మురళీమోహన్, పర్యవేక్షక సిబ్బంది హెల్త్ అసిస్టెంట్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.