మానకొండూర్‌ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీ

నవతెలంగాణ – మానకొండూర్‌ : మానకొండూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కరీంనగర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లలితా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా నిర్వర్తించాలని సూచించారు. అనంతరం చెంజర్ల గ్రామంలో నూతనంగా నిర్మించే ఆరోగ్య ఉపకేంద్రం స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మానకొండూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి అరెల్లి కిరణ్‌ కుమార్‌, సీహెచ్‌ఓ రాజు నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.