డీఎంహేచ్ఓ అకస్మిక తనిఖీ..

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి ఆరోగ్య కేంద్రాన్ని డీఎం హేచ్ఓ పుట్ల శ్రీనివాస్ బుధవారం అకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసి మందుల నిలువలు, రాష్ట్ర, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రికార్డులను నమోదు చేసి ,  ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం వైద్యులు క్రిష్ణ తేజ్, పార్మాసిస్ట్ అనురాధ, సూపర్ వైజర్ కళావతి, ఎల్డీ కంప్యూటర్ మధు, సిబ్బంది పాల్గొన్నార.
ఆరోగ్య కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి..
తోటపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను డీఎంహేచ్ఓ పుట్ల శ్రీనివాస్ పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేల గుత్తేదారుకు అదేశించాలని డీఎంహేచ్ఓ వైద్యులు క్రిష్ణ తేజ్ కు సూచించారు.