సికిల్ సెల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సికిల్ సెల్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలని డి.ఏం & హెచ్.ఓ. డాక్టర్ కోటచలం కోరారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, అనుమతితో బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో డి.టి.డి.ఓ. కె.శంకర్ ఆధ్వర్యములో సికిల్ సెల్ వ్యాధి పట్ల గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సికిల్ సెల్ వ్యాధి అనేది ఎర్ర రక్త కణాల ఆకారం సికిల్ (కొడవలి)గా మారడముతో రక్తప్రసరణ జరగకపోవడముతో అవయవాలలో ఆక్సిజన్ అందక సికిల్ సెల్ అనీమియా వొస్తుందన్నారు.మేనరిక వివాహాలతో కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశముందన్నారు. చేతులు, కండ్లు, శరీరము తెల్లగా పేలిపోవడముతో ఈ వ్యాధిని గుర్తించవచ్చన్నారు. అనంతరం డి.టి.డి.ఓ. మాట్లాడుతూ ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవము సందర్బంగా బుధవారం నుండి తేదీ జులై 3 వరకు కూడా ప్రభుత్వ గిరిజన వసతి గృహాలు/ఆశ్రమ పాఠశాలల యందు సికిల్ సెల్ వ్యాధిపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించనున్నామన్నారు.వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యములో స్క్రీనింగ్ టెస్టులు చేపించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రత్యేక అధికారి పద్మావతి, సూపరింటెండెంట్ కె.పార్థసారధి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనునయి, డెప్యూటీ డి.ఏం & హెచ్.ఓ.లు డాక్టర్ జి. చంద్రశేఖర్, డాక్టర్ ఎండి నిరంజన్, పిఓ, ఎన్.సి.వి.బి.డి.సి. డాక్టర్ నజియా తబుస్సమ్, డెప్యూటీ డెమో ఏ.అంజయ్య, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.