నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ నగరంలోని సీతారాం నగర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మాట్లాడుతూ.. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదగా ఉండాలని అన్నారు. ఆరోగ్య కేంద్రంలోని మందులు నిల్వను, టీకాలు నిల్వచేసే ఫ్రిడ్జ్ ను, ల్యాబ్ ను, పరిశీలించడం జరిగింది, ఫార్మసిస్టులు ముఖ్యంగా మందుల నిల్వను ఉండేలా చూస్తూ, టీకాలు నిల్వచేసే ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ ని రోజూ రికార్డు చేయాలని అన్నారు.ఎన్సీడీ స్క్రీనింగ్, ఎం సి హెచ్, ప్రతిరోజు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారి అన్నిజాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ అన్ని పారామీటర్స్ లో ముందుండాలని తెలియజేశారు, అదేవిధంగా స్థానిక సిబ్బంది కి పరిసరాల శుభ్రతపై, ఆసుపత్రి లో శుభ్రతపై సూచనలు చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్య, ఫార్మసిస్టు సూపర్వైజర్ నారాయణ, ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఉన్నారు.