
పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ను జిల్లా డిఎంహెచ్వో రాజశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, డాక్టర్ ప్రవీణ్, ఆనంద్, ఎల్ టి కృష్ణ, ఫార్మసిస్టు సురేష్, తదితరులు పాల్గొన్నారు.