
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలను తూచా తప్పక పాటించాలని, అనుక్షణం అప్రమత్తతతో విధులునిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ( ఎలక్ట్రికల్) సౌత్ సెంట్రల్ జోన్,హైదరాబాద్ బిశ్వనాధ్ బెహరా అన్నారు.మంగళవారం ఆయన ఏఎల్ పి గనిని సందర్శించారు. ముందుగా గని ఆవరణలో గల సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. అనంతరం గని లొపలికి వెళ్ళి లాంగ్ వాల్ 3 వ, ప్యానల్ ఏర్పాటు కోసం అమర్చిన విద్యుత్తు పరికరాలు, ఏవిధంగా అమర్చడం, వాటి పనితీరు మొదలగు పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు,సలహాలు,సూచనలు ఇచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్తును ఉపయోగించే సమయంలో రక్షణ సూత్రాలను తూచా తప్పక పాటించాలని, అందుకోసం భద్రత పరికరాలను తప్పక వాడాలని( ధరించాలని) ,విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అనుక్షణం అప్రమత్తతతో విధులను నిర్వహించాలని సూచించారు.ఆయనకు ఏపీఏ, జీఎం కె వెంకటేశ్వర్లు గనిలో చేపడుతున్న భద్రత చర్యల వివరాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సీతారామం, ప్రాజెక్ట్ ఇంజనీర్ టి రఘురాం, ఎస్ ఓఎం కె జనార్ధన్, సేఫ్టీ ఆఫీసర్ ఎం రమేష్, ఎస్ఈ బాలరాజు, ఈఈ అన్వేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.