ఎంచుకున్న వృత్తికి న్యాయం చేయండి

విద్యుత్‌,పంచాయతీరాజ్‌ శాఖల అధికారులకు సూచనలు
ఎంపీపీ వై రవీందర్‌ యాదవ్‌
నవతెలంగాణ-కేశంపేట
ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్తు తీగలను వెంటనే సరి చేయాలని, బ్రిడ్జ్‌లపై గుంతలమయంగా మారిన బీటీ రోడ్డును సరి చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని వెంటనే సరి చేయాలని విద్యుత్తు, పంచాయతీ రాజ్‌ శాఖ ల అధికారులకు ఎంపీపీ వై రవీందర్‌ యాదవ్‌ సూచిం చారు శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ మందిర ఆవ రణలో ఎంపీపీ వై రవీందర్‌ యాదవ్‌ అధ్యక్షతన కేశంపేట మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా సభ్యులు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను సభా దష్టికి తీసుకువచ్చారు.ఒక ప్రాణం బలయితే తప్ప ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్తు తీగలను సరి చేయరా అంటూ తొమ్మిది రేకుల ఎంపీటీసీ యాదయ్య ఆవేదన వ్య క్తం చేశారు. చిన్నపాటి గాలులు వీస్తే సరి కరెంటు పోయి చీకట్లో ఉండవలసిందినని పాపిరెడ్డి గూడ సర్పంచ్‌ తాండ్ర విష్ణువర్ధన్‌ రెడ్డి, అల్వాల ఎంపీటీసీ సురేష్‌ రెడ్డి సభ దషికి తీసుకువచ్చారు.తమ గ్రామంలో నెలకొన్న కరెంటు సమ స్యను పరిష్కరించాలంటూ తూర్పుగడ్డ సర్పంచ్‌ లలిత సంబంధిత అధికారిని కోరారు. సమాచారం ఇవ్వకుండానే విద్యుత్‌ అధికారులు గ్రామ పంచాయతీలో ఉన్న చెట్లను నేలమట్టానికి నరకడం ఎంతవరకు సమంజసం అని కేశం పేట సర్పంచ్‌ తలసాని వెంకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బైర్కాన్‌పల్లి సర్పంచ్‌ కష్ణయ్యతోపాటు మరికొందరు స భ్యులు ఆరోపించారు. ఈ విషయాలపై ఎంపీపీ స్పంది స్తూ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా చెట్లను నరకడం సరికాదన్నారు. నేలమట్టంగా కాకుండా అవస రమున్నంత మేరకే చెట్లను నరికే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారికి సూచించారు. ప్రమా దపరితంగా ఉన్న విద్యుత్తు తీగలను వెంటనే సరి చేయా లన్నారు. భగీరథ ద్వారా ప్రజలకు అందించే తాగునీటి విషయంలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. కేశంపేట, లేమామిడి బ్రిడ్జిలపై ప్రమాదంగా ఉన్న గుంతలను సరి చేసి బీటీ రోడ్డు వేయాలని సంబంధిత అధికారికి సూచిం చారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం అంది స్తున్న రుణాలను పొందేందుకు మహిళలు బ్యాంకు వద్ద పడి కాపులు కాయవలసి వస్తున్నదని, మహిళా గ్రూపులకు ఇబ్బందులకు గురి చేస్తున్న వెల్‌జర్ల బ్యాంకు నుండి కేశం పేట మండల కేంద్రంలోని బ్యాంకులకు మార్పిడి చేయిం చాలని సంబంధిత అధికారులకు సూచించారు. దత్తయ పల్లి గ్రామంలో అధికారులకు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఒంటెద్దు పోకడ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ వాడ్యాల అనురాధ పర్వ త రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ గండ్ర జగదీశ్వర్‌ గౌడ్‌, తహసి ల్దార్‌ ఆజం అలీ, ఇన్‌చార్జీ ఎంపీడీవో రవిచంద్ర కుమార్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచా యతీ కార్యదర్శులు,పలు శాఖల అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.