నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక నాటి ప్రభుత్వం కాళింగులను బీసీ కులం జాబితా నుండి తొలగించడంతో ఈ కులం పేదలు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని ఆ కులం సంఘం నాయకుడు పాలవలస జీవన్ రావు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కోరారు. మంగళవారం స్థానిక వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మలను జీవన్ రావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్పందిస్తూ కులం సమస్య,రిజర్వేషన్ లు అనే రాష్ట్ర స్థాయిలో చర్చించి ఉన్నత స్థాయి అధికారులు తీసుకోవాల్సిన అంశం అని,దీని పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చిస్తానని సుముఖంగా స్పందించారు.
ఆయన వెంట బండి భాస్కర్ రావు,స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు.