– ఎల్ఆర్ఎస్ పేరుతో లక్షల్లో వసూలు
నవతెలంగాణ-బాన్సువాడ నసురుల్లబాద్ : పేదల నుంచి భూముల క్రమబద్ధీకరణ పథకానికి (ల్ఆర్ఎస్) రుసుము వసూలు చేయొద్దని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ నేత షేక్ జుబేర్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం ఆయన మున్సిపల్ ఆఫీస్ లోని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ని ఉచితంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పేదలందరికీ ఉచితరహాలు ఇస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఇందులో భాగంగానే ఎల్ఆరఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఛార్జ్ పేరుతో 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుసుము వసూలు చెయ్యడం సరికాదన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలపై కోట్ల రూపాయలు బారం వేయ్యడం ఏమిటని ప్రశ్నంచారు. గతంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తు దారులు ప్రతి ఒక్కరు ఒక వెయ్యి రూపాయలు చెల్లించారు. ఇప్పుడు ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఛార్జ్ పేరుతో లక్షలు వసూల్ చెయ్యడం పేదలకు భారంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజుగా ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దన్నారు ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్‌ను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.