– దేవి ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతులకు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మోద్దని పేర్కొన్నారు. ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు ఇవ్వటంతోనే రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించటం సరికాదని తెలిపారు. రైతులకు రావాల్సినవి ఇవ్వకుండా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నారనే భావనతో రైతాంగానికి ఉద్యోగులపై కోపం పెంచే విధంగా ప్రేరేపించడం తగదని హెచ్చరించారు.