
నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 9వ డివిజన్ నంది హిల్స్ కాలనీలో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వొద్దని బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి రామిడి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నందీహిల్స్ కాలనీవాసులు ఎక్సైజ్ సూపర్డెంట్ రవీందర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందీహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి ఇస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారని తెలిపారు. అందుకు బార్ అండ్ రెస్టారెంట్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశమని చెప్పారు. ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ రవీందర్ రావు స్పందిస్తూ ఎట్టి పరస్థితుల్లో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతులు ఇవ్వబోమని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఈఎస్ హనుమంతరావు, హయత్ నగర్ ఎక్సైజ్ సిఐ లక్ష్మణ గౌడ్, న్యూ నంది హిల్స్ అధ్యక్షుడు చల్లా సురేందర్ రెడ్డి, కార్యదర్శి కృష్ణా రెడ్డి, గౌరవ సలహాదారులు మట్ట సత్యనారయణ గౌడ్, ఏల్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.