అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: బడితేల రాజయ్య

నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో ఇటీవల కన్నూరి రమమ్మ అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 25 కిలోల సన్నబియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ ఇంచార్జి అధ్యక్షుడు చంద్రగిరి సంపత్, చిట్యాల లచ్చయ్య, చంద్రగిరి అశోక్, మంతెన వెంకయ్య, చిర్ర ఎల్లారి, కంబాల శంకర్, మంచినీళ్ల రాజయ్య, కన్నూరి కుమార్, సమ్మయ్య, పోచయ్య, లింగయ్య పాల్గొన్నారు.