చేదు వ్యసనాలకు లోను కావద్దు…

నవతెలంగాణ-దామరచర్ల
విద్యార్థులు గంజాయి వంటి చెడు వ్యసనాలకు లోను కావద్దని ఉపాధ్యాయుల విద్యాబోధనను సక్రమంగా అలవర్చుకొని స్వశక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని  హెడ్ కానిస్టేబుల్ నాగిరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడటం వలన యువకులు తమ లక్ష్యానికి చేరుకోవచ్చని, పోలీసులకు యువతకు మధ్య స్నేహభావం పెంపొందించాలని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు భాస్కర్, ఖయ్యూం, కోటయ్య, సతీష్ ,కార్తీక్ ,సైదులు, గోపాలకృష్ణ, హోంగార్డులు చంద్రశేఖర్, చంద్రశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు.