ప్రతిపక్షాల అబద్ధాల కోరు మాటలను నమ్మరు

– ఎన్నికల్లో విజయం గులాబీదే
– ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధాల కోరు మాటలను ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరని దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం మండల పరిధి నిడిగొండ గ్రామంలోని వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో సీనియర్‌ నాయకులు నామాల బుచ్చయ్యగౌడ్‌ అధ్యక్షత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివద్ధిలో నాలుగో స్థానంలో నిలిచిందని అన్నారు. నియోజకవర్గానికి 3,000 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అత్యధికంగా దళితులు ఉన్న ఈ నియోజకవర్గంలో 11,000మంది లబ్ధిదారులకు దళిత బంధు రానున్నట్లు వివరించారు. పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ కేంద్రంలో అధికారంలోకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలానికి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తలను ఆదుకుంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎంపీపీ వై కుమార్‌ గౌడ్‌, జెడ్పీటీసీ ల జిల్లా ఫోరం అద్యక్షులు బొల్లం మణికంఠ అజరు, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ నామాల బుచ్చయ్య గౌడ్‌, జనగామ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మున్సిపట్ల విజరు, యాక స్వామి గౌడ్‌, శివరాత్రి రాజు, మాల రాజు, మనోజ్‌ రెడ్డి, నియోజకవర్గ మహిళా ఇన్చార్జి మట్లపల్లి సునీత రాజు, తిప్పారావు రమ్య, లోకుంట్ల సుజన్‌ కుమార్‌, అశోక్‌, తిప్పారపు మమత పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.