జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు బంద్‌ చేయొద్దు

– ట్విట్టర్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ (జీపీ) లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్‌ చేయొద్దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారంనాడాయన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలదన్నట్టు, ఇప్పుడు జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు, పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.