నవతెలంగాణ – అశ్వారావుపేట
శాంతి భద్రతలను కాపాడే విషయం లో కఠినంగా ఉండాలని,సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు రాకుండా చూడాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి క్రైం మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కువచ్చిన పిర్యాదులు,నమోదైన కేసుల రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ పక్కన ఉన్న సీఐ, ఎస్సై క్వార్టర్స్,జంగారెడ్డిగూడెం మార్గంలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్ తో పాటు సరిహద్దు చెక్ పోస్టు పరిశీలించారు. డీఎస్పీ తో పాటు అశ్వారావుపేట సీఐ కరుణాకర్,అదనపు ఎస్సై శివరామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.